వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఉద్యోగులు ఒప్పుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా మారే ఛాన్స్ కూడా ఉంది. అందుకే టాటాలను తెరపైకి తెచ్చారనే అనుమానాలు కూడా ఉన్నాయి. విదేశీ కంపెనీలకో లేదా, బీజేపీ నాయకులకు సన్నిహితులు ఉన్న గుజరాత్ కంపెనీలకో వైజాగ్ స్టీల్ ని అప్పగించకుండా టాటా కంపెనీకు అమ్మేస్తే కొంతలో కొంత సానుకూలత ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ప్రతిపాదనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.