రాహుల్ బొజ్జాను ఓట్ల కోసమే సీఎంఓలో కార్యదర్శిగా నియమించారని విమర్శించారు. కేసీఆర్ కు మొదటి నుంచి దళితులపై వివక్ష ఉందని ఓట్ల కోసమే ప్రస్తుతం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ గవర్నర్ నరసింహన్‌లకు బోర్లాపడి దండాలు పెట్టిన కేసీఆర్.. దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కనీసం చేతులెత్తి దండం పెట్టలేదని గుర్తు చేశారు.