ఏపీలో బీజేపీ, టీడీపీతో సానుకూల ధోరణిలో ఉండాలని చూస్తోంది. ఆమధ్య చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలిచ్చినా.. రాను రాను వారిలో టీడీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థమవుతోంది. తాజాగా తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర సభలో కూడా పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేసింది బీజేపీ. గతంలో చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రంలో సమస్యలొచ్చాయని, వాటిని వైసీపీ కొనసాగిస్తోందని విమర్శించేవారు బీజేపీ నేతలు. ఇప్పుడు మాత్రం పూర్తిగా తప్పులన్నీ వైసీపీపైనే నెట్టేస్తున్నారు.