చంద్రబాబు తర్వాత టీడీపీని ఎవరు నడపాలి..? జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీ సమర్థంగా నడపగలరని పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అలాంటి సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సీనియర్ నేత, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పార్టీకి కొత్త నాయకత్వం కావాలి, వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటూ బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అదిగో.. అదే ఆయన చేసిన తప్పు. సహజంగానే ఎన్టీఆర్ ని తనకు కాంపిటీషన్ గా ఫీలవుతారు లోకేష్. అలాంటిది జూనియర్ రావాలి, కొత్త నాయకత్వం రావాలంటూ బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలతో లోకేష్ మరింత నొచ్చుకున్నారని సమాచారం. అక్కడినుంచి ఆయన్ను పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా పెట్టారట.