చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోలేదట. సొంత పార్టీ నాయకులకు కూడా తగినంత సమయం ఇచ్చేవారు కాదట. రాజధానిగా అమరావతి విషయంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని ఆర్కే గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి ప్రాంతం ఎంపిక దగ్గర నుంచి అక్కడ చేపట్టబోయే కార్యక్రమాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయలేదని ఆర్కే గుర్తు చేశారు.