సినిమాలో పాత్రలకు, నిజ జీవితానికి సంబంధం ఉంటుందని నమ్మలేం కానీ, సరిగ్గా చిరంజీవి ఇప్పుడు పొలిటికల్ మూవీ చేయడం, అది కూడా తమ్ముడి రాజకీయాలకు అండగా నిలబడే పాత్రలో చిరంజీవి నటించడం యాదృచ్ఛికమే అవుతుంది. అభిమానులు మాత్రం అదే నిజం కావాలని కోరుకుంటున్నారు. చిరు-పవన్ కలిస్తే.. జనసేన రాజకీయ ప్రస్థానం మరింత బలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.