మానిటైజేషన్ పేరుతో కేంద్రం 6లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని చూస్తోంది. ప్రైవేటీకరణకు పేరుమార్చి ఇలా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడతున్నాయి. అయితే ప్రతిపక్షాలకు పూర్తి అవకాశం ఇవ్వకుండా, రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ప్రైవేటీకరణకు ఒప్పుకుంటే, నిధుల్లో వాటా ఇస్తానంటోంది. అదనపు ఆర్థిక సాయం చేస్తామంటోంది.