సొంత పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ వంటి బలమైన నాయకుడిని.. తానే స్వయంగా బయటకు పంపి ఉపఎన్నికకు కారణం అయ్యారు కేసీఆర్. ఈటల రాజేందర్ తనంతట తాను పార్టీ నుంచి వెళ్లిపోతే.. అది వేరే సంగతి కానీ.. పార్టీ నుంచి వెళ్లగొట్టిందే కేసీఆర్. అందువల్ల కేసీఆర్ ఈటల రాజేందర్ అనే శత్రువును కొని తెచ్చుకున్నట్టు అయ్యింది.