శివసేనతో బీజేపీ పొత్తు కోరుకుంటుందనే విషయం వాస్తవం. ఇటీవల దీనికి సంబంధించి మోదీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే అవన్నీ కేవలం వ్యక్తిగతం అని సీఎం ఉద్ధవ్ కొట్టిపారేసినా, మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు మొదలవుతాయని, శివసేన, బీజేపీ కలసిపోతాయని అనుకున్నారంతా. ఈ దశలో కేంద్ర మంత్రి, మహా రాష్ట్ర సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల కావడం చకచకా జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రధాని నోరు మెదపకపోవడమే ఇప్పుడు ప్రశ్నార్థకం.