2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సొంతబలం ఎంతుందో, జగన్ బలం కూడా అంతే వారికి తోడయింది. చాలా చోట్ల జగన్ వేవ్ లో ఎమ్మెల్యేలు ఒడ్డునపడ్డారు. 2024 ఎన్నికలనాటికి కూడా అదే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరున్నా, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినా కాకపోయినా, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నవారంతా జగన్ కి కృతజ్ఞతగానే ఉంటారని, ఆ ఓటు బ్యాంకుతో ఒడ్డునపడిపోవచ్చని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది.