అసలే ఆర్థిక సమస్యలు.. ఆపై సంక్షేమ భారం.. వీటికి తోడు కరోనా కాటు.. ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. జగన్ ముందుగా ఇచ్చిన ఏ మాటను తప్పలేదు.. ఏ వర్గానికీ ఆర్థిక సాయం ఆగలేదు. మరి ఆ డబ్బులెలా వస్తున్నాయి.. లెక్కకు మించిన అప్పుడు చేస్తున్నారా.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారా.. అప్పుతెచ్చి పప్పుకూడు పెడుతున్నారా.. ఇప్పుడు అందరిదీ ఇదే సందేహం.. అయితే.. ఆ ఒక్కటీ అడక్కు అంటోంది ప్రభుత్వం.