ప్రత్యేకించి నాయకులు మీడియా ముందు మట్లాడినప్పుడు.. ఇలాంటి సంచలనాలు లేకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లు లేకుండా.. సాధారణంగా గంభీరంగా మాట్లాడితే ఆ వార్తలు పత్రికల్లో, టీవీల్లో పెద్దగా కనిపించవు. ఏమాత్రం గాడి తప్పినా.. నోరు జారినా ఆ రోజంతా ఆదే న్యూస్ వైరల్ అవుతుంది. అందుకే నేతలు కూడా ఇప్పుడు రూట్ మార్చేశారు..రోజుకో సంచలనం కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే రేవంత్ తిట్లకూ.. మల్లారెడ్డి సిగపట్లకూ మీడియాకూడా కారణమే అని చెప్పకతప్పదు.