ఏపీలో పెంచిన ఆస్తి పన్ను వసూళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా పెంచిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, సెప్టెంబర్ 15లోగా ఇళ్లు, భవనాల వారీగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు అధికారులు. ఈ నోటీసుల ప్రకారం ప్రజలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెరిగిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో ఇప్పటికే చాలామంది ముందస్తు అర్థ సంవత్సర పన్ను చెల్లించి ఉన్నారు. అయితే వారు కూడా పెరిగిన రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలోగా ఏడాది పన్ను మొత్తం ప్రజలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను అధికారులు ఆదేశించారు.