తాను హైకోర్టులో పిల్ వేశానని రేవంత్ రెడ్డి అంటున్నారు. తన పిల్ కారణంగానే ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయంటున్నారు. దీనిపై సిట్ విచారణ వివరాలు తమకు ఇస్తే తాము విచారణ చేస్తామని తెలంగాణను కోరాయట. అందుకే తెలంగాణ సర్కారు ముందుకురాలేదని.. అందుకే ఈడీ, సీబీఐ హైకోర్టును ఆశ్రయించి ఇప్పుడు విచారణకు సిద్ధమయ్యాయట. అలా మొత్తానికి రేవంత్ రెడ్డి టాలీవుడ్లో కొందరి పాలిట విలన్ అయ్యారన్నమాట.