తెలుగు దేశం పార్టీ అంత చురుకుగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో జనసేన ప్రజాసమస్యలపై దృష్టి పెట్టిన జనంలోకి వెళ్తే.. మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే తెలుగు దేశానికి ప్రత్యామ్నాయంగా పార్టీ ఎదిగే అవకాశమూ కనిపిస్తోంది. అందుకే ఇక పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేస్తోంది.