ఏపీ అప్పుల్లో ఉంది, ఏపీని అప్పుల్లెకి నెట్టేశారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీపై నింద వేయాలని చూసినా, కేంద్రం మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుందని సర్దిచెప్పుకున్నా.. కుదిరేలా లేదు. ఏపీ అప్పుల్ని చంద్రబాబు ప్రధానంగా హైలెట్ చేస్తున్నారు, ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికలనాటికి బలంగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఆ లోగా అప్పుల తిప్పలు తప్పించుకోడానికి జగన్ సర్కారు కూడా ఆలోచన చేస్తోంది.