ఒక్కసారిగా వాట్సప్ ఆగిపోతే ప్రపంచం ఆగిపోయినంత పనైంది. ఎవరికీ కాలూ చెయ్యీ ఆడలేదు. అంటే అందరూ దానికి అంతలా బానిసలైపోయారనమాట. ఉదయం లేచి చూడగానే వాట్సప్ తిరిగి నార్మల్ స్టేట్ కి వచ్చి ఉంటుందా లేదా అనే ఆతృతే అందరిలో కనిపించింది. మొబైల్ డేటా ఆన్ చేయగానే వాట్సప్ మెసేజ్ లు ఒక్కొక్కటే రావడం చూసి అందరూ హమ్మయ్య అనుకున్నారు. అయితే వాట్సప్ కి ఇంతలా బానిసలవడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు ఇలాంటి షాక్ లు ఉంటేనే.. అందరూ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తారు.