బండి సంజయ్కు తన పార్టీ హైకమాండ్ నుంచి చక్కటి సహకారం అందుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి అంత మంచి సహకారం తన సొంత పార్టీ హైకమాండ్ నుంచి లభించడంలేదు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులూ వచ్చారు.