భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చురుగ్గా వ్యవహరిస్తున్నందున.. సంక్షేమంపై పరిమితులు విధించగలిగితే జస్టిస్ ఎన్వీ రమణ దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారట. చరిత్రలో నిలిచిపోతారని ఆర్కే అంటున్నారు. ఆర్కే విజ్ఞప్తి బాగానే ఉంది.. కానీ ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోకూడదన్నది న్యాయవ్యవస్థ పాటించే మౌలిక సూత్రం.. మరి జస్టిస్ రమణ ఆ గీత దాటతారా.. దాటి జగన్, కేసీఆర్ వంటి వారిని కట్టడి చేస్తారా..?