మావోయిస్టు నేతల్లో చాలా మంది రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం కూడా ఉంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్, ఇర్వి మోహన్ రెడ్డి వంటి వారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.