మన్మోహన్ సింగ్ హయాంలో దేశం అనేక రికార్డులు సాధించింది. దేశం గరిష్ట స్థాయిలో జీడీపీ నమోదు చేసింది. ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెట్టింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా రెండు అంకెల వృద్ధి రేటు నమోదైంది. దాదాపు 12 శాతం వరకూ ఈ వృద్ధి రేటు ఉంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనూ చెప్పుకోదగిన అభివృద్ధి నమోదైంది. వ్యవస్థలు వాటంతట అవి నడిచే అవకాశం కల్పించారు. అనవసర జోక్యం.. అధికార దర్పం అన్నవి ఆయన కాలంలో లేవు.
అంతే కాదు.. అభివృద్ధి సంగతి అటుంచి.. సమాజంలో అన్ని వర్గాల మధ్య విద్వేషాలు లేవు.. మన్మోహన్ సింగ్ ఓ ఆర్థిక మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కాలంలో మరో మేధావి అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా కొంతకాలం ఉన్నారు. ఇలాంటి మేధావుల సారథ్యంలో దేశం నడిచింది. ఆ తర్వాత కాలంలో పరిస్థితి మారుతూ వచ్చింది.
కేంద్రంలో అధికారం మారింది. సోషల్ మీడియా రాకతో దుష్ప్రచారం.. వ్యక్తి పూజకు ఆస్కారం ఏర్పడింది. వాస్తవం గడప దాటే లోపల అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. సమాజాన్ని విభజించి భావోద్వేగాలు రెచ్చగొట్టే కొత్త రాజకీయ వ్యూహం పకడ్బందీగా అమలవుతోంది. చైనాను చూపించి.. పాకిస్తాన్ ను చూపించి.. ప్రజలను మాయ చేసే రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉపందుకోవడమే కాదు.. అవి విజయవంతం అవుతున్నాయి. ఫలితంగా దేశ అభివృద్ధి సూచీలు నేలకు చూస్తున్నాయి. మరి ఈ మార్పు ఏ తీరానికి.. జనం ఆలోచించాలి.