ఏపీ ప్రభుత్వం చంద్రబాబుపై మరో కేసు పెట్టబోతోందా.. పెగాసస్‌ కేసు పెట్టి చంద్రబాబును వేధించాలని జగన్ డిసైడ్ అయ్యారా.. ఈ అంశంపై పొలిటికల్ సర్కిళ్లో ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై చంద్రబాబు కూడా తన తాజా ప్రసంగాల్లో చెబుతున్నారు. నిన్న నగరి పర్యటనలోనూ చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఎప్పుడూ హత్యా రాజకీయాలు ఎప్పుడూ చెయ్యలేదన్న చంద్రబాబు నాపైనా తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు.


ఇప్పుడు తనపై పెగాసస్ అని కొత్త కేసు అంటున్నారని చంద్రబాబు వివరించారు. జగన్ అందరినీ వాడుకుని వదిలేశాడని... ఇప్పుడు తన తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేశాడని చంద్రబాబు విమర్శించారు. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉంటారని ఇదెక్కడి నిర్ణయమని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్లలో అవినీతి ద్వారా జగన్ లక్షా 75 వేల కోట్లు సంపాదించాడని చంద్రబాబు ఆరోపించారు. జగన్ 100 శాతం హామీలు అమలు చెయ్యడం కాదని.... ప్రజలను 100 శాతం మోసం చేశాడని చంద్రబాబు అన్నారు.


జగన్ ఏం సాధించారని వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేశారని... అద్దె మనుషులతో ప్లీనరీ నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. జగన్ పథకాలు నవరత్నాలు కాదని..  నవఘోరాలని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ పాలన అవినీతిమయంగా మారిందని.. పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని.. విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచారని.. మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో జగన్ కు ఆదాయం సమకూరుతుందని చంద్రబాబు విమర్శించారు.


చెత్త మీద కూడా పన్ను వేసిన ఘనత జగన్ కే దక్కిందన్న చంద్రబాబు..  తమ హయంలో పవర్ లూమ్స్ కు 50 శాతం సబ్సీడీ ఇచ్చామని కానీ.. జగన్ వచ్చాక తీసేశారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని.. ఎలుకలు మద్యం తాగుతున్నాయని...ఉడతలు కరెంట్ తీగలు కొరుకుతున్నాయని..తేనె టీగలు రథాలు కాల్చేస్తున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: