అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంతో పోల్చి చూస్తే... మద్యం అమ్మకాలు తగ్గాయని.. బెల్టు షాపులు తొలగించడం, పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
అంతే కాదు.. మద్యం రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎస్‌ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్... చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలని సూచించారు. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
గంజాయి, అక్రమ మద్యం కేసులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాను అప్‌గ్రేడ్ చేయాలని.. నాన్ ఆపరేషనల్ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.