ఇది అమెరికా నిఘా సంస్థల సీక్రెట్ ఏజెన్సీ నివేదిక ద్వారా బయటికి వచ్చిన అంశం. ఇటలీలో ఉన్న టాక్స్ వ్యవహారం బయటికి రాదు. దీనికి ఆపరేషన్ సిల్క్ రోడ్ అని పేరు పెట్టి మరీ విచారణ చేస్తున్నారు. యూరప్ లోని కొన్ని వ్యవస్థల ద్వారా చైనాకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అవి టాక్స్ కట్టక్కర్లేదు అలాగే క్రిమినల్ రూట్లో వెళ్తున్నాయి. ఇది ఎవరు నడిపిస్తున్నారు అంటే ఇటలీ మాఫియా.
డ్రగ్ సప్లయర్స్ కూడా చైనా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారు. దాదాపుగా మూడు ట్రిలియన్ యూరోలు అక్కడికి చేరుకుంటున్నాయన్న విషయం బయటపడింది. ఇక్కడ చైనా తెలివితేటలు వేరేగా ఉంటాయి. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని దాని దగ్గర పెట్టుకుని తర్వాత వాళ్లకు ఇవ్వదు. ఇంతకుముందు ఆలీబాబా పరిస్థితి ఏమైంది బాగా సంపాదించిన తర్వాత తరిమేసారు కదా.
అట్లాగే కొన్ని దేశాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు చెబుతుంది ఏంటంటే చైనాలో ముందు ప్రోత్సహిస్తారు అంట, ప్రపంచం మొత్తం అమ్ముకురా డబ్బులు సంపాదించుకుని రా అంటుందట. కానీ ఆ డబ్బును మాత్రం తన దేశానికి తీసుకుపోతుందట. ఈ మాఫియా వాళ్ళకి డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటలైజేషన్ టైంలో ఏ క్షణంలో బ్లాక్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఇప్పుడు చైనా ప్రభుత్వమే నడుపుతున్న అక్రమ మనీ కేంద్రంలో దాచుకుంటున్నారట.