ఆ ఉచ్చుకు వ్యతిరేకంగానే రష్యా చేసినటువంటి తిరుగుబాటు అనాలా, సపోర్ట్ చేస్తున్న ఉక్రెయిన్ కి పాఠం అనాలో కానీ ఆ టైంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఉక్రెయిన్ లో బ్రతుకులు ఏమయ్యాయి. కోట్ల మంది దేశం విడిచిపోయారు, కోట్ల మంది వీధిని పడ్డారు, వందలాది నగరాలు సర్వనాశనం అయ్యాయి. తిండికి తిప్పలు పడుతున్నారు, బ్రతకడానికి దిక్కు లేకుండా పోతుంది.
కేవలం అక్కడ దర్జాగా బ్రతుకుతున్న వాడు ఎవడైనా ఉన్నాడంటే, అది కూడా భయం భయంగా దర్జాగా బ్రతుకుతున్న వాడు కేవలం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి మాత్రమే. మిగతా వాళ్ళందరూ తిప్పలు పడుతున్నారు. అలాంటి దశలో ఇప్పుడు ఉక్రెయిన్ కి సంబంధించి కీలక పరిణామం ఏంటయ్యా అంటే ఇలాంటి ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చే వాళ్ళందరిని యూరప్ దేశాలన్నీ తమ దేశానికి రమ్మని ప్రత్యేక విమానాలు ద్వారా పట్టుకెళ్ళిపోయారు.
వీళ్ళు కూడా పక్కన ఉన్న పోలాండ్ కి, ఆ దేశాలకు శరణార్థులుగా వెళ్లి తర్వాత ఇలా వెళ్లారు. వెళ్తే ఇలాంటి శరణార్థులని బైడెన్ ఈరోజుకు కూడా యుద్ధం మొదలయ్యి ఏడాది అయిపోయినా సరే, తొలినాళ్లలో వెళ్ళిన వీళ్ళకి ఈరోజుకి కూడా అమెరికన్ యంత్రాంగం పౌరసత్వం గానీ, వీళ్ళు బతకడానికి కావలసిన అవకాశం గాని ఇవ్వడం లేదు. కేవలం ఊరి చివరన శిబిరాల కింద బతుకుతున్నారు వీళ్ళు.