మానవ జీవితం మార్పుల మయం. ప్రతి విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అంతరిక్షం విషయంలో పరిశోధనలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. 30 బిలియన్ టైమ్స్ కంటే ఎక్కువ వేడి పుట్టించే వాతావరణం బ్లాక్ హోల్ లో ఉందని అది దేన్నైనా తనలోకి లాగేసుకుంటుందని యూకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రావిటేషన్ పోర్స్ ద్వారా ఇది దేన్నైనా పూర్తిగా లాగేసుకుంటుందని చెప్పారు. ఇవి ఎలా పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి అనే పరిశోధనలు జరుపుతున్నారు.


ఈ బ్లాక్ హెల్స్ కు సంబంధించిన పరిశోధన చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఈ బ్లాక్ హోల్స్ వివిధ నక్షత్రాలను, ప్లానెట్లను ఆకర్షిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో పెద్ద చర్చే నడుస్తోంది.  వీటితో 10 నుంచి 40 బిలియన్ టైమ్స్ ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.


మానవ జీవన పరిణామ క్రమంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతుంది. చెట్ల ఆకులను నడుముకు కట్టుకుని జీవించే పరిస్థితి నుంచి అంతరిక్షంలో కృష్ణ బిలాలను కనుక్కొనే వరకు సాగుతోంది. మనిషి మేధస్సుకు తెలియని విషయాలు ఎన్నో ఎన్నో అంశాలు అంతరిక్షంలో దాగున్నాయి. వాటిన్నింటిని కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మనిషి కనుగొన్నది కొంత, చేయాల్సింది కొండంత ఉందని తెలుస్తోంది.


అదే ఇప్పుడు బ్లాక్ హోల్స్ రూపంలో సైంటిస్టులకు అతి పెద్ద పరీక్ష పెడుతున్నాయి. సూర్యుడి కంటే 30, 40 బిలయన్ డాలర్ల కంటే ఎక్కువ వేడితో అన్నింటిని లాగేసుకుంటోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మరి అలా ఎందుకు జరుగుతోంది. అంతటి గ్రావిటీ పవర్ అక్కడ ఎలా ఉంది. ఈ కృష్ణ బిలాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రుడి మీద కాలు మోపిన మనిషి, అంగారక గ్రహం పైనే క్యూరియసిటీ అనే మిషన్ ను ప్రవేశపెట్టాడు. రేపు కృష్ణ బిలం లోపల ఉన్న విషయాల్ని కూడా కచ్చితంగా కనుక్కుంటాడని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: