మళ్లీ తాజాగా తాను తెలుగుదేశం నాయకులను ముఖ్యమంత్రిగా చేయడానికి లేను అని, అందుకోసం నేను రాలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు పవన్. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పవన్ మాత్రం ముందు నుండి క్లారిటీ గానే ఉన్నారని కొంతమంది అంటున్నారు. గతంలో వాళ్ల పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశంతో పొత్తు ఉండదు అని అనుకుంటూ ఉంటే ఆయన పొత్తు ఉంది అంటూ ఖరారు చేసేసారు. అయితే వాళ్ల పార్టీకి సంబంధించిన నాయకులు గానీ, సాధారణ జనం గాని అనుకునేది ఏంటంటే ఒక పెద్ద ప్రాంతీయ పార్టీతో చిన్న ప్రాంతీయ పార్టీ గనుక పొత్తు పెట్టుకుంటే, ఆ తర్వాత పెద్ద ప్రాంతీయ పార్టీ చిన్న ప్రాంతీయ పార్టీని మంచి దూసుకు వెళ్లిపోతుందని అంటున్నారు.
దీనికి సాక్ష్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు పార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దెబ్బ తిన్నాయి అన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ కూడా దెబ్బతిన్న విషయం చెప్తున్నారు వాళ్లు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి మాట్లాడదాం అని అన్నారు. ఇలా పవన్ మాటల్లో మార్పు కనిపిస్తుందని అంటున్నారు.