పౌరసత్వ సవరణ చట్టాన్ని2024 మార్చి 11 నుంచి దేశంలో అమలు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20189లో సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత దీనిని అమలు చేస్తున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో వలస దారులు ఉన్నారు. సరిహద్దు నిర్వహణపై ఉన్న టాస్క్ ఫోర్స్ 15 మిలియన్ల అక్రమ వలసదారులు ఉన్నట్లు పేర్కొంది.

2004లో యూపీఏ ప్రభుత్వం 12మిలియన్ల వలసదారులు ఉన్నారని పార్లమెంట్ వేదికగా వివరించింది. అయితే వీరు ఓటు హక్కును కూడా పొందారు. ఇలా ఓటు హక్కును పొందిన వారిని ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. 2014 డిసెంబరు 31నాటికి దేశంలో విదేశీ శరణార్థులు 289394 మంది ఉన్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


ఇదిలా ఉండగా తాజాగా సీఏఏ ప్రస్తావన ఏపీ రాజకీయాల్లో వచ్చింది. దీనిపై స్పందించిన నారా లోకేశ్ సీఏఏకు అనుకూలంగా ఓట్లేసిన వారిలో వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారని.. కావాలనే కొంతమంది టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ బిల్లు పై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఆ చట్టం గురించి సందేహాలుంటే అప్పుడు ఎందుకు ఓటేశారు. ఇప్పుడు ఎందుకు రాజకీయంగా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని ప్రశ్నించారు.


సీఏఏ వల్ల మైనార్టీ సోదరులు దేశం వదిలి పెట్టి పోవాలని ఎవరు చెప్పారు. ఇదంతా ఫేక్ న్యూస్. ఈ విషయంపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై కూటమి పెద్దలతో మాట్లాడి సరైన వేదిక మీద హామీ ఇప్పించే బాధ్యత నాది అని నారా లోకేశ్ అన్నారు. అయితే  సీఏఏ అనేది మరేదీ కాదు. విదేశాల్లో ఉన్న హిందువుల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టం. ఈ విషయాన్ని వివరిస్తే సరిపోతుందని.. దీనిపై హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ముందు దీని గురించి ఆయన తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే సరిపోతుందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: