టెన్త్ స్టూడెంట్స్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..ఆన్ లైన్ క్లాసులకు తగ్గట్లుగానే పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. రెండు పేపర్లు అంటే పేపర్ 1,2 లు ఉన్నాయి. రానున్న విద్యా సంవత్స రంలో అన్నీ ఒక పేపర్ ను చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక పరీక్షా సమయాన్ని కూడా రెండున్నర గంటలకు నుంచి గంటన్నరకు కుదించే అవకాశాలున్నాయి.