ఓపెన్ టెన్త్, ఇంటర్ కు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు సర్కార్ నిర్ణయం..తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్‌కి షెడ్యూల్ విడుదలైనట్లు ఖమ్మం డీఈఓ మదన్మోహన్, జిల్లా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒపెన్ స్కూల్ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి అడ్మీషన్ పొందాలని సూచించారు. ఇతర వివరాలకు 8008403522 ఈ నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవాలని కోరారు.