విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దేందుకు కావల్సిన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. కరోనా ఉపశమనం తర్వాత తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ముందుకు వస్తుందని ఆయన అన్నారు.మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను రూపొందించనున్నామని తెలిపారు. నిరుద్యోగ సమస్యను రూపు మాపేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.