కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఉన్నత విద్యార్థులకు కరోనా నిబంధనలను పాటిస్తూ క్లాసులకు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి నవంబర్ వరకు పాఠశాలలు మూత పడ్డాయి. దాదాపు ఒక ఏడాది చదువు వృదా అయ్యింది. దీంతో ఇప్పుడు ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ను రూపొందించారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..