విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్ ముగించి రివిజన్ చేయించే సన్నాహాల్లో పడ్డాయి.ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.