ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది 11 కి బదులుగా ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయి. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను పెంచనున్నట్లు ఏపి విద్యా శాఖ మండలి నిర్ణయించింది. పరీక్షల కోసం కొత్త హాల్ టికెట్ లను మే 2021 లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.