ఐఓసీఎల్ లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఈ మేరకు అందులో ఖాళీలు ఉన్న పోస్టు ల వివరాలను తాజాగా ఆ సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూస్తే.. మొత్తం 356 ఖాళీలున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఏడాది కాలం అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది.