అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న వారికి పెద్ద ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పరీక్షలను రద్దుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 8, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికిగా ప్రకటించారు. వారందరి నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు..