టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో మీడియాలో ఇటీవల అనేక కథనాలు వచ్చాయి. వారికి వేతన పెంపు ఉండదన్న ప్రచారం కూడా సాగడంతో టీచర్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే సీఎం ఈ విషయంపై స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. టీచర్లకు కూడా ఉద్యోగులతో పాటు పీఆర్సీని అమలు చేస్తామని సీఎం హమీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో పాటు ఉద్యోగలు పదవీ విరమణ వయస్సుపై సైతం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతున్న విషయాన్ని సీఎం కెసిఆర్ వెల్లడించారు.