ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు కియా మోటార్స్ సంస్థ ఒక శుభవార్త ను చెప్పింది. కార్ల ఉత్పత్తి కి ప్రస్తుతం పేరుగాంచిన కియా సంస్థ తన కంపెనీ లో పలు పోస్టులను భర్తీ చేయడం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశిస్తోంది . అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వారు ఈ నెల 16న కృష్ణా జిల్లా లోని గుడ్లవల్లేరు లోని Gudlavalleru Engineering College లో ఇంటర్వ్యూలు నిర్వహించబోతోన్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలో పెనుగొండ లోని కియా కార్ల కంపెనీ లో పని చేయాల్సి ఉంటుంది.