ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పరీక్షలకు పులిస్టాప్ పెట్టి, కేవలం ఒక్క పరీక్ష ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అయ్యేలాగా కేంద్రం భావిస్తోంది . ఇక అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (CET) ని ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో CET నిర్వహించడానికి నేషనల్ ఏజెన్సీ ( NRA) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.