నీట్ కు చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకొని ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే సీటు ను సంపాదిస్తారు. అలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురవుతాయి. మార్చి లో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లు ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు కావాల్సిన డాక్యుమెంట్లను, వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ కు అప్లై చేసే సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. సూచించిన ఫార్మాట్లో ఆ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.