కేంద్రం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. చదువుకుంటే రూ. 2వేల రూపాయలు సాయం చేయబోతోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దూరవిద్య విధానంలో పది, ఇంటర్ చదవాలనుకునే వారికే ఈ అవకాశం. వీరికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఏడాదికి రూ.2 వేల మేర ప్రోత్సాహం అందిస్తారు.