స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు..అదే దారిలో వెండి..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.50,120 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. రూ.45,940 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో వెండి ధర రూ.71,300 వద్దనే ఉంది.