పసిడి ప్రియులకు శుభవార్త..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 దిగొచ్చింది. దీంతో రేటు రూ.48,600కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. ధర రూ.200 క్షీణతతో రూ.44,550కు పడిపోయింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మరింత దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.1500 పతనమైంది. దీంతో రేటు రూ.72,900కు తగ్గింది.