మళ్లీ తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ మార్కెట్లో  బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 దిగొచ్చింది. దీంతో రేటు రూ.47,170కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గుదలతో రూ.43,240కు పడిపోయింది.బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. వెండి ధర కేజీకి రూ.300 పతనమైంది. దీంతో రేటు రూ.73,000కు దిగొచ్చింది