మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 పడిపోయింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.560 తగ్గుదలతో రూ.42,690కు దిగొచ్చింది. వెండి ధర కేజీకి రూ.800 పతనమైంది. దీంతో రేటు రూ.72,500కు దిగొచ్చింది