పడిపోయిన పుత్తడి ధర.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,600కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.650 క్షీణతతో రూ.41,800కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.2400 పతనమైంది. దీంతో రేటు రూ.70,400కు దిగొచ్చింది.