పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగింది. దీంతో రేటు రూ.46,040కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.190 పెరుగుదలతో రూ.42,200కు చేరింది.. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేటి మార్కెట్ లో వెండి రేట్లను చూస్తే..వెండి ధర భారీగా పెరిగింది. రూ.900 పైకి కదిలింది. దీంతో రేటు రూ.72,500కు ఎగసింది.