పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 క్షీణించింది. దీంతో రేటు రూ.46,080కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 క్షీణతతో రూ.42,240కు తగ్గింది.వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.71,800 వద్దనే ఉంది.