ఈ రోజు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే, నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కు రూ.44,700 ఉండగా, ఇక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు రూ.48,770 గా నమోదయింది. అంటే నగల తయారీకి ఉపయోగించే బంగారం ఒక గ్రాము కు రూ.4,470 ఉండగా, పెట్టుబడికి ఉపయోగించే 24 క్యారెట్ గోల్డ్ ఒక గ్రాము ధర 4,877 రూపాయలుగా నమోదయింది. అంటే ఈ ధరలు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్, వరంగల్ జిల్లాలలో ఒకేలా ఉండడం విశేషం..ఇక వెండి విషయానికి వస్తే, కేజీ వెండి ధర 76 వేల రూపాయలు ఉంది. అంటే కేవలం ఆరు నెలల్లోనే రూ.12,600 కు పెరిగింది.