బంగారం ధరలు.. ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు... ఒకసారి తక్కువ ఉంటే మరో సారి భారీగా పెరుగుతాయి.. ఒకసారి భారీగా పెరిగితే మరోసారి స్వల్పంగా తగ్గుతాయి.. ఇలా అయితే బంగారం ధరలు ఎలా తగ్గుతాయి? కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి.. ఇలా అయితే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి? 

 

కరోనా వైరస్ ప్రభావం అయితే మరి ఘోరంగా ఉంది.. బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గేలా లేవు.. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. అయినప్పటికీ ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి.. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల తగ్గుదలతో 46,430 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయిల తగ్గుదలతో 43,610 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల తగ్గుదలతో 41,100 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ తులం 24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుడగా తులం 22 క్యారెట్ల బంగారం ధర 43 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. కాగా లాక్ డౌన్ పొడిగింపుతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: